సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodad constituency ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్( Bollam Mallaiah Yadav ) గత రెండు రోజులుగా త్రిపురారం,అనంతగిరి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా మహిళల నుండి నిరసన సెగ తగిలింది.
త్రిపురవరం మండలం ఖానాపురం గ్రామంలో దళిత బంధు, గృహలక్ష్మి పథకం ఎవరికిచ్చారని గట్టిగా నిలదీశారు.వెంకట్రాంపురం గ్రామంలో అధికార పార్టీ సర్పంచ్ రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది.
ఖానాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి ముందు ఒక లీడర్ మాట్లడుతూ జై కాంగ్రెస్ అంటూ నినదించినాలుక కరుచుకున్నారు.
అజ్మీరాతండా గ్రామానికి రోడ్డు లేక నానా అవస్థలు పడుతున్నామని తండా వాసులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.
శంకుస్థాపన చేసి సంవత్సరం దాటినా రోడ్డు కాకపోవడంతో గ్రామస్తులు గట్టిగానే అర్సుకున్నారు.త్రిపురావరం గ్రామంలో దళిత బంధువు( Dalit Bandhu ) రాలేదని ఒక వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థికి వేలు చూపిస్తూ నిలదీయడంతో పని చేసే నాయకుడిని ఇలా చేస్తే మిమ్ముల్ని దేవుడు కూడా రక్షించలేడని మల్లయ్య యాదవ్ అసహనం వ్యక్తం చేశారు.