తెలంగాణ ప్రభుత్వం "ఆరోగ్య మహిళ" కార్యక్రమానికి శ్రీకారం

సూర్యాపేట జిల్లా:ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

 Telangana Govt Launches arogya Mahila Programme , Arogya Mahila , Bollam Mallai-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందని అన్నారు.

మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.

ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందఅన్నారు.

ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని,మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఎంచుకుంటే అందులో మన నియోజకవర్గాలను త్రిపురారం సెలెక్ట్ కావడం అభినందనీయమన్నారు.ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని మహిళలందరూ ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలన్నారు.

మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమమని, ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయన్నారు.అనంతరం మహిళా ప్రజాప్రతినిధులకు, మహిళా ఉద్యోగస్తులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్,ఎంపీపీలు చుండూరు వెంకటేశ్వర్లు, కోదాడ ఎంపిపి చింతా కవిత,నడిగూడెం ఎంపిపి యాతాకుల జ్యోతి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ,వైస్ ఎంపీపీ రాణి,డాక్టర్స్ నిరంజన్, కళ్యాణ్ చక్రవర్తి,ప్రసన్న లక్ష్మి,సర్పంచుల పోరం అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు,మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, తాసిల్దారులు, ఎంపీడీవోలు,వైద్య సిబ్బంది,టిఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube