సూర్యాపేట జిల్లా:బైక్ అదుపు తప్పి హైవే పక్కన ఉన్న బ్రిడ్జి కింద పడడంతో బైక్ పై ఉన్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిన విషాద ఘటన 65వ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం ఉండ్రుగొండ స్టేజి వద్ద సోమవారం చోటుచేసుకుంది.మృతురాలు సూర్యాపేట పట్టణం హైటెక్ బస్టాండ్ సమీపంలో గల ఇందిరా కాలనీ చెందిన వీరబోయిన నర్సమ్మ(58)భర్త గోపయ్యగా,గాయపడిన వ్యక్తి వీరబోయిన నాగరాజు(22)గా గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన నాగరాజు హుటాహుటిన సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.