ఓటిటిలోకి రాబోతున్న 'విక్రమ్'.. డేట్ ఫిక్స్.. త్వరలోనే స్ట్రీమింగ్..

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.

చాలా రోజులుగా ఫామ్ లో లేకపోయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

ఇక తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు.

ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.

Advertisement

ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.వారి ఎదురు చూపులు ఫలించేలా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 3న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో హిట్ మూవీగా డిసైడ్ చేసేసారు.

సొంత బ్యానర్ లో కమల్ ఈ సినిమాను నిర్మించారు.దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.

అందుకే కమల్ చాలా సంతోషంగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంకా ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.ఇక థియేటర్ లలో సూపర్ హిట్ అయినా విక్రమ్ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా హక్కులను తీసుకున్నారు.దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.జులై 8 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని వార్తలు అయితే వసున్నాయి.

Advertisement

త్వరలోనే డేట్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.

తాజా వార్తలు