సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఎల్కారం గ్రామానికి చెందిన వడ్డే ఎల్లయ్యపై బుధవారం రాత్రి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.గాయపడిన ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడిని కాంగ్రేస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.