సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో చోటుచేసుకున్న అవినీతి బాగోతానికి గతంలో సీఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిన తనపై ఆరోపణలు చేయడం అవినీతిని తప్పు దారి పట్టించడానికేనని రిటైర్డ్ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు.మంగళవారం ఆయన తెల్లబెల్లి కో ఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై మాట్లడుతూ తాను రిటైర్డ్ అయిన 27 నెలలు తరువాత పీఏసీఎస్ చైర్మన్ చిన్న కుమారుడు నాపై ఆరోపణలు చేయడం ఛైర్మన్ ఆడుతున్న నాటకమన్నారు.
దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు చైర్మన్ కుటుంబంలోనే ఇన్సూరెన్స్ సబ్సిడీలు ఇచ్చుకుంటూ అమాయక ప్రజల్ని మోసం చేస్తూ లక్షలో దోచుకొని తిన్నది చైర్మన్ కుటుంబీకులేనని ఆరోపించారు.సొసైటీ డైరెక్టర్లకు తెలియకుండా సమావేశాలు నిర్వహించిందెవరు?పాత రికార్డుల్లో దొంగ సంతకాలు పెట్టిందెవరు?పాత రికార్డులను డైరెక్టర్లు ఎందుకు తీసుకువెళ్లారు? సబ్సిడీ కేవలం చైర్మన్ కుటుంబీకులకేనా?రైతులకు వర్తించదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.తప్పుడు వ్యవహారాలు చేసేది, తప్పుడు ఆరోపణలు చేసేది చైర్మన్ కుటుంబీకులేనని మండిపడ్డారు.ప్యాడ్ సంబంధించి గత నాలుగు సీజన్లో రెండున్నర లక్షలు స్వాహా చేసినట్టు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇన్సూరెన్స్ పేరిట ఒకొక్క రైతు నుంచి రూ.32 వేల చొప్పున వసూలు చేసిన డబ్బులు ఏమైందని? సంవత్సరానికి ఇన్సూరెన్స్ ఎంత? ఇన్సూరెన్స్ పేరిట తీసుకున్న మొత్తంలో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు? మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లో నింపుకున్నారు?రైతులను మోసం చేస్తూ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ,నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.తాను రిటైర్డ్ అయిన 27 నెలల తర్వాత ఇప్పుడు ఎలా ఆరోపణలు వస్తున్నాయని,ఈ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని,ఈ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని,తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.