సూర్యాపేట జిల్లా:ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన( Praja Palana ) కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని మాజీ డిసిసి ఉపాధ్యక్షుడు మన్సూర్ అలీ ( Mansoor Ali )అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఐదో వార్డు వర్తక సంఘం భవనంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని,ప్రజల దరఖాస్తులను నింపి అధికారులకు అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను 420 అని విమర్శిస్తున్న గులాబీ లీడర్లు రాష్ట్రంలో నెంబర్ వన్ 420 పార్టీ బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందన్నారు.
అందుకే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
వారి మాటలను నమ్మే పరిస్థితిలో ఇప్పుడు ప్రజలు లేరన్నారు.కాంగ్రెస్ పార్టీ ( Congress party )నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు తగదన్నారు.
పార్టీలకు,కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం కొరకు ప్రజల వద్దకే ప్రజా పాలన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిందని, ప్రజా పాలన కార్యక్రమాన్ని పేద ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని, అపోహలకు గురికావద్దని,ప్రజా పాలన కార్యక్రమం ప్రతి నాలుగు నెలలకోసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని, పేద ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ఐదో వార్డులో ప్రజా పాలన ఏడో రోజు వరకు 348 కుటుంబాల దరఖాస్తులు వార్డు అధికారులకు సమర్పించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐదో వార్డు ప్రజా పాలన అధికారి సతీష్, వెంకటేశ్వర్లు,ఆర్పీలు,ఆశా వర్కర్లు,వార్డు ప్రజలు పాల్గొన్నారు.