సూర్యాపేట జిల్లా:రష్యా,ఉక్రెయిన్ యుద్ధం సాకుగా వంట నూన ధరలపై ప్రభావం చూపిస్తున్నారని సరఫరాదారులు చెబుతున్నారు.ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తూ కొనుగోలు చేపడుతున్నారు.
ధరలు పెరగడంతో ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నామ వేణు పేర్కొన్నారు.మంచి నూనె ధరలు ఈ నెల రోజుల్లోనే సుమారు రూ.50 పెరిగాయని,లీటర్ నూనె ప్యాకెట్ ధర 200 రూపాయలు దాటిందన్నారు.నెల క్రితం 130 రూపాయలు వరకు ఉన్న ధర,మొన్న ఒక లీటర్ ప్యాకెట్ కొంటే దానిమీద ఎంఆర్పి రూ.217 వేశారని వాపోయారు.ఎక్కడో జరిగే యుద్ధం పేరు చెప్పి అడ్డగోలుగా ధరలు పెంచితే పేద,మధ్యతరగతి వాళ్ళం ఎలా భరించగలమని ప్రశ్నించారు? ప్రభుత్వం ధరలను నియంత్రించి నూనె ధరలను తగ్గించేలా చూడాలని సూచించారు.