సూర్యాపేట జిల్లా:గత కొన్ని రోజులుగా జాతీయ ఉపాధి హామీ పథకం( National Rural Employment )లో
పని చేస్తున్న కూలీలకు అకౌంట్లో డబ్బులు జమ కావడం లేదని ఆగ్రహించిన చివ్వెంల మండల( Chivvemla mandal ) కేంద్రానికి చెందిన
సుమారు 100 మందిఉపాధి హామీ కూలీలుమండల ఎంపీడీఓ కార్యాలయం ముందుసోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లడుతూఎర్రటి ఎండలో సైతం ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకున్నా పనులు చేసి రోజులు గడుస్తున్నాఅకౌంట్లలో డబ్బులు పడడం లేదని వాపోయారు.
ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదని,అందుకే తన సమస్య పరిష్కారం కోసం ఎంపిడిఓ కార్యాలయం( MPDO Office ) ముందు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికన్నా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.