సూర్యాపేట జిల్లా: గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ,భారత్ ఆర్ట్ అకాడమీల ఆధ్వర్యంలో లార్జెస్ట్ కూచిపూడి డాన్స్ లెసన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్( Guinness World Records ) అసెవ్మెంట్ ప్రోగ్రాం హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు.నాట్యం పోటీల్లో కోదాడ( Kodad )కు చెందిన తిరుపతిస్వామి శిష్య బృందం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది, లండన్ కు చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సీఈవో రిషికేష్,తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు,ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క చేతుల మీదుగా అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు.
బాల నృత్య కళాకారిణులు అమృషలక్ష్మి,కుసుమ, లౌక్య,అక్షయ,సౌమ్య, మనోజ్ఞ,సాన్విక,యామిని, ఉమాశ్రావణిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా నాట్యగురువు తిరుపతి స్వామీని ఆయన శిష్య బృందాన్ని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు గుడిపూడి శ్రీధర్ రేవతి,కిరణ్మయి, శైలజ,లక్ష్మినారాయణ,డాక్టర్ శిరీష,డాక్టర్ కరుణ్ కుమార్,రమేష్ మమతా, రాంబాబు,సుహాసిని,శైలజ,స్రవంతి పాల్గొన్నారు.