జిల్లాకు చేరిన దళిత బంధు లొల్లి

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలంలో దళిత బంధు రెండో విడతలో భాగంగా యూనిట్లు ఎంపికలో అధికార పార్టీకి చెందిన వారికే కేటాయిస్తున్నట్లు ఆరోపిస్తూ దళిత మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.తమకు జరుగుతున్న అన్యాయంపై మండల అధికారులు స్పందించక పోవడంతో బుధవారం బక్కుమంతులగూడెం గ్రామానికి చెందిన దళిత మహిళలు జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టరేట్ లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటేల్ ని కలిసి స్థానికంగా జరుగుతున్న దళిత బందు ఎంపిక విషయాన్ని వివరించి వినతిపత్రం సమర్పించారు.

 Lolli, A Dalit Relative Who Joined The District-TeluguStop.com

అనంతరం మహిళలు మాట్లాడుతూ పార్టీలు చూడకుండా అర్హులైన దళితులకు దళిత బంధు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి మహిళలు విజ్ఞప్తి చేశామని చెప్పారు.కార్యక్రమంలో బుర్ర నాగేంద్ర,మంగమ్మ,బుర్ర జ్యోతి శ్రీలక్ష్మి,గురవమ్మ,అలివేలు,బచ్చలకూరి వీరయ్య,బుర్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube