సూర్యాపేట జిల్లా:కుటుంబ సమస్యల కారణంగా ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హుజూర్ నగర్ మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బూరుగడ్డ గ్రామానికి చెందిన ఏనుగుల సత్యానారాయణ,శ్రీలక్ష్మి(33)దంపతులు ఈ మధ్య గ్రామంలో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు.
కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో యల్లమ్మ పండగా చేద్దామని భర్త కోరగా భార్య వద్దని చెప్పింది.ఈ విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తాయి.ఈ క్రమంలో మనస్థాపానికి గురైన భార్య శ్రీలక్ష్మి తేదీ:14.05.2022 శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి తల్లి సురగాని పద్మ ఫిర్యాదు మేరకు హుజూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.