రక్త హీనత.ముఖ్యంగా పిల్లల్లో, ఆడవారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది.
శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.ఈ రక్త హీనతను దూరం చేసుకునేందుకు చాలా మంది ఐరన్ టాబ్లెట్స్ వాడుతుంటారు.
అయితే రక్త హీనత సమస్యను దూరం చేయడంలో కేవలం మందులే కాదు.ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
సరైన ఆహారంతో కూడా ఈ సమస్యను నివారించుకోవచ్చు.అలాంటి ఆహారంలో రేగి పండ్లు కూడా ఉంటాయి.
వింటర్ సీజన్‌లో విరి విరిగా దొరికే రేగి పండ్లు ఇష్టపడని వారుండరు.ముఖ్యంగా పిల్లలు అయితే రుచిగా ఉండే ఈ రేగి పండ్లను మరింత ఇష్టంగా తింటారు.
అయితే రుచిలోనే కాదు.బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ రేగి పండ్లు ముందుంటాయి.
ముఖ్యంగా రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్‌ను పెంచే ఐరన్ రేగి పండ్లలో పుష్కలంగా ఉంటుంది.అందువల్ల రక్త హీనత ఉన్న వారు రేగి పండ్ల తీసుకుంటే.
రక్త వృద్ధి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్త హీనతకు చెక్ పెట్టడమే కాదు.
రేగి పండ్లతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.శరీర రోగ నిరోధ శక్తిని పెంచే విటమిన్ సి మరియు కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఎ రేగి పండ్లలో ఉంటాయి.
అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే రేగి పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకి సులువుగా వెళ్తాయి.అదే సమయంలో లివర్ పని తీరు కూడా మెరుగుపడుతుంది.
అంతేకాకుండా, ఎముకలను మరియు దంతాలను బలంగా మార్చేందుకు సహాయపడే కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా రేగి పండ్లలో ఉంటాయి.ఒత్తిడి మరియు మానసిక ఆందోళనను దూరం చేయడంలో రేగి పండ్లు గ్రేట్‌గా సహాయపడతాయి.
ఇక రేగి పండ్లు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు.