మూసీ నది( Musi River )కి భారీగా వరద నీరు దిగువకు వదలడంతో జిల్లా కేంద్రం నుండి భీమారం వెళ్ళే బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుందని సూర్యాపేట తహశీల్దార్ వెంకన్న,రూరల్ ఎస్‌ఐ సాయిరాం అన్నారు.గురువారం రాత్రి భీమారం బ్రిడ్జి( Bheemaram Bridge )ను సందర్శించి,అక్కడి పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ వాహనదారులు బ్రిడ్జిపై నుంచి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.సమీప గ్రామాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ లోని టోల్ ఫ్రీ నెంబరు 6281492368 నంబర్‌తో పాటు డయల్ 100ను సంప్రదించాలని కోరారు.