ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు:ఎస్ఐ ముత్తయ్య

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మండల కేంద్రంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను హుజూర్ నగర్ పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు.ఎలాంటి అనుమతి లేకుండా మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

 Strict Action Will Be Taken If Sand Is Transported: Si Muttiah, Suryapet Distri-TeluguStop.com

మూడు ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తుండగా పట్టుబడి చేసి AP 39 UR 4514,TS 29 TB 2578, TS29N4610 గల ట్రాక్టర్ డ్రైవర్లు బొడ్డు వెంకటేశ్వర్లు,గుగులోతు సైదులు,గొల్లగోపు శ్రీను,ఇసుక రవాణాకు సహకరించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.ఎవరైనా సరే అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube