నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు...!

సూర్యాపేట జిల్లా: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కూడా బోర్డులకే పరిమితమై,ఏర్పాటు చేసిన నాటినుండి నేటి వరకు నిరుపయోగంగానే ఉన్నాయని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.ఆటలకు ఉపయోగపడే విధంగా లేకపోవడంతో ఆటలు ఆడుకోలేకపోతున్నామని,ఈ క్రీడా ప్రాంగణాలు రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Sports Grounds Becoming Useless Suryapet District, Sports Grounds , Suryapet Dis-TeluguStop.com

క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చూడాలని మునగాలకు చెందిన క్రీడాకారుడు సిరికొండ అజయ్ అన్నారు.

మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు.

క్రీడా ప్రాంగణం ఊరికి దూరంగా ఉండటంతో ఎవరూ ఉపయోగించుకో లేకపోతున్నారు.వేల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసిన నిరుపయోగంగానే ఉంటుంది.

అధికారులు స్పందించి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పుల జానకి రెడ్డి మాట్లడుతూ గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను బోర్డులకే పరిమితం చేసి క్రీడాకారులకు ఉపయోగపడకుండా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube