సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి సాగుతున్న వలసల పర్వానికి తెర పడేలా కనిపిస్తలేదు.సోమవారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామ సర్పంచ్ (బీఆర్ఎస్) ఆదూరి పద్మ, భర్త కోటయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు మేకల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మేకల ధనమ్మతో పాటు 200 కుటుంబాలు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మేల్యే ఒంటెద్దు పోకడతో విసుగు చెంది అనేక మంది పార్టీని వీడుతున్నారని,పార్టీలో ఎవరికీ సముచిత స్థానం లేదని,కనీసం సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడ్డామని చెప్పారు.
హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ లో చేరామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.