సూర్యాపేట జిల్లా:కోదాడ సమీపంలోని లక్ష్మీపురం కాలనీలో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు.దారి గుండా వచ్చిపోయే వారిపై జులుం చేస్తూ, వాహనదారులను,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకులు కాలనీలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ప్రతి రోజు మత్తు పదార్థాలు సేవించి తుగుతూ డాన్స్ చేస్తూ ఈలలు,కేకలు వేయడం వంటి చర్యలతో హల్చల్ చేస్తున్నారు.కాలనీ వాసులు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.
మద్యం మత్తులో ఎప్పుడు ఏం చేస్తారోనని భయపడుతున్నారు.ఇప్పటికైనా పోలీసుల రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిలపై చర్యలు చేపట్టలని కోరుతున్నారు.







