ఈమధ్య డైరెక్టర్లు తీసే టేకింగ్ మీదే కాదు మ్యూజిక్ డైరెక్టర్ ను అందించే సంగీతం మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులను అంతకంతకూ పెరిగిపోతున్నాయి.ఒక సినిమా వచ్చి ఆ సినిమాలో సంగీతం సూపర్ హిట్ అయిందంటే చాలు ఇక ఆ తర్వాత ఏ హీరో సినిమా వచ్చిన ఆ సినిమాలో అంతకుమించి అనే రేంజ్ లోనే మ్యూజిక్ ఉండాలి.
ఏమాత్రం తగ్గినా ఇక ప్రేక్షకులు అరెరే ఇంకొంచెం స్పెషల్ గా ఉంటే బాగుండేది అని బాగా హార్ట్ అయిపోతున్నారు.ఇలా మ్యూజిక్ డైరెక్టర్ పై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో కొంతమంది హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించడానికి మాత్రం మరింత ఒత్తిడి గా ఫీల్ అవుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు.
ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ అందించడం అంటే ఒక పెద్ద కొండనీ నెత్తి మీద పెట్టుకున్నట్టు భారంగా ఫీలవుతున్నారు అన్నది తెలుస్తుంది.
ఎందుకంటే పవర్ ఫుల్ డైలాగుల్లో గాని.
ఆయన చేసే యాక్షన్ సన్నివేశాలు.కానీ ఇక పవర్ఫుల్ డాన్సులు.
కానీ అదే రేంజిలో ఉండే ఎమోషన్స్.ఇలా ఆ రేంజ్ కు తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేస్తేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.
ఏమాత్రం తగ్గినా కూడా ప్రేక్షకులను నిరాశ పరుస్తూ ఉంటాయ్.ఇక ఎమోషన్ సీన్స్ లో తారక్ భావాలు పండిస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా అంతే కీలకం.
ఎందుకంటే ఏ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కేవలం నటిస్తాడు అనడం కంటే జీవిస్తాడు పాత్రకి ప్రాణం పోస్తాడు అని చెబితే బాగుంటుంది.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న దర్శకనిర్మాతలు మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాకు తమిళ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే బీస్ట్ సినిమాకు మ్యూజిక్ అందించి అందరినీ ఉర్రూతలూగించాడు.యువ సంగీత దర్శకుడు.దీంతో ఇక ఎన్టీఆర్ 30 సినిమాకు మ్యూజిక్ కూడా అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.మ్యూజిక్ సెట్ అయితే అనిరుద్ కు ఒక సాలిడ్ గిఫ్ట్ కూడా ఆఫర్ చేశారట నిర్మాతలు.ఇక ఇలాంటి ఆఫర్లు వచ్చిన తర్వాత అనిరుద్ స్పెషల్ మ్యూజిక్ అందించడం ఒక సవాల్ లాంటిదే అని చెప్పాలి.
ఇక దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ 30 సినిమాకు సరికొత్త మ్యూజిక్ వినబోతున్నాము అన్నది అర్ధమవుతుంది.