అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా నాలాను పూడ్చి వేసి వెంచర్ లో కలుపుకోవడంపై బీజేపీ సూర్యాపేట పట్టణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎండి అబిద్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ నుండి కేసారం వెళ్ళే దారిలో 32 ఎకరాల్లో పర్మిషన్ లేకుండా అక్రమంగా వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నారని,శాంతినగర్ నుండి దాసాయిగూడెం మీదుగా కల్లెపెల్లోడి కుంటకు వెళ్లే నాలా ఈ వెంచర్ మధ్యలోనే ఉన్నదని,అక్రమ వెంచర్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు నాలాను పూడ్చి వేశారని ఆరోపించారు.

 Action Should Be Taken Against Illegal Ventures-TeluguStop.com

నాలాను పూడ్చడం వల్ల ఈ ఏరియా పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉన్నదన్నారు.దీనితో పాటు కల్లేపెల్లోడికుంటకు నీరు చేరక చుట్టుపక్కల ఉన్న పొలాలు ఎండిపోతాయని రైతులు చెబుతున్నారని అన్నారు.

లే అవుట్ పర్మిషన్ లేకుండా అక్రమ వెంచర్లు నిర్మాణం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజలకు ప్లాట్లను విక్రయిస్తున్నారన్నారు.ఈ వెంచర్ లలో ప్లాట్లు తీసుకున్న ప్రజలు ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉందని,నాలా పూడికను తీసివేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర,జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube