సీపీఎం నాయకులు అరెస్ట్

సూర్యాపేట జిల్లా:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతర్గత ఎమర్జెన్సీ నడుపుతున్నదని,అందులో భాగంగానే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని,ఈ అక్రమ అరెస్టులను ఖండించంచాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 Cpm Leaders Arrested-TeluguStop.com

పోలీస్ స్టేషన్లో నిరసన తెలియజేసిన ఆయన మాట్లాడుతూ బీజేపీ లౌఖిక భారతదేశములో మతాల మద్య చిచ్చు రేపుతూ పబ్బం గడుపుకొంటుందని ఎద్దేవా చేశారు.దేశంలో 2020 సంవత్సరంలో సీఏఏ,ఎన్ఆర్సి లాంటి పౌరసత్వ చట్టాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల నుండి తిరుగుబాటు రాగానే ఎనకకు తీసుకుని,మళ్లీ దేశంలో ఉపఎన్నికలు అయిపోగానే పౌరసత్వ చట్టాన్ని తిరగదోడటం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.

గత సంవత్సరం రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై వేల కోట్ల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేస్తుందని,అంతేకాకుండా 87 కోట్ల రూపాయల లాభం ఆ ఫ్యాక్టరీకి వచ్చాయని,అలాంటి ఫ్యాక్టరీని ఈనెల 12వ తేదీన ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించే విధంగా ధరల పెరుగుదల,ఆర్థిక కుంభకోణాలు చేస్తూ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube