సాగర్ ఎడమ కాలువే క్రికెట్ గ్రౌండ్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఆట స్థలంగా మార్చుకొని విద్యార్థులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం ఆదివారం క్యూ న్యూస్ కెమెరాకు చిక్కింది.గత వానాకాలం సీజన్లో వర్షాలు సరిగ్గా కురువక,నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు రాక,సాగర్ జలాయశం అడుగంటిన విషయం తెలిసిందే.

 Sagar Left Channel Cricket Ground , Cricket Ground, Sagar Left Channel , Nagarju-TeluguStop.com

దీనితో ఎడమ కాలువకు నీటి విడుదలకు అవకాశం లేక ఆయకట్టు కింద వ్యవసాయం పూర్తిగా తగ్గిపోయి దాదాపుగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.కొద్దో గొప్పో బోర్లు,బావుల కింద సాగు చేసిన పంటలకు యాసంగి నీటి కొరత ఏర్పడి ఎండిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈనేపథ్యంలో వరుసగా మూడు రోజులు స్కూల్స్ కి సెలవులు రావడంతో నీళ్లు లేక ఎండిపోయి గ్రౌండ్ లాగా మారిన సాగర్ ఎడమ కాలువ విద్యార్థులకు క్రీడా స్థలంలా మారింది.ఆదివారం విద్యార్థులు,చిన్నపిల్లలు సరదాగా క్రికెట్,ఇతర ఆటలు ఆడుతున్నారు.

ఈసారైనా వర్షాలు బాగా కురిసి సాగర్ డ్యామ్ నిండితే,ఎడమ కాలువ నీటి విడుదల కావాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube