కానిస్టేబుల్స్ కు ప్రమోషన్

సూర్యాపేట జిల్లా:సివిల్ కానిస్టేబుల్స్ కు జిల్లాలో మరోసారి 31 మందికి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ప్రమోషన్ పొందిన సిబ్బందికి ఎస్పీ ఈరోజు తన కార్యాలయం నందు ప్రమోషన్ ఉత్తర్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 Promotion To Constables-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమోషన్ పొందడం అనేది జీవితంలో చాలా సంతోషకరమైన విషయమని అన్నారు.సమాజంలో గౌరవం పెరుగుతుంది,బాధ్యత పెరుగుతుందని గుర్తు చేశారు.

క్రమశిక్షణతో పని చేసి మునుముందు ప్రమోషన్స్ కూడా పొందాలన్నారు.కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకోవాలని తెలిపారు.

సగర్వంగా,బాధ్యతగా విధులు నిర్వర్తించే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి,తద్వారా వ్యస్థకు కూడా మంచి పేరు వస్తుందన్నారు.ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలన్నారు.

ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్,ప్రమోషన్ పొందిన సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ గ్రీవెన్స్ డే కు 7 ఫిర్యాదులు

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన నేటి పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 7 ఫిర్యాదులు అందాయి,ప్రతి ఫిర్యాదుదారుతో ఎస్పీ మాట్లాడి పరిశీలించారు.త్వరగా స్పందించి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ప్రజలు బాధ్యతగా ఉండాలని,వర్షాల ప్రభావంతో ఎలాంటి ప్రమాదాలకు గురికావోద్దని కోరారు.భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు పరమత్తంగ ఉండాలి,పిల్లలను బయటకు వెళ్ళనివోద్దన్నారు.

అత్యవసర సమయాల్లో పోలీసు సహాయానికి 100 ఫోన్ చేయాలని కొరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube