విద్యాశాఖ సూపరిండెంటెండ్ ను సస్పెండ్ చేయాలి-విద్యార్ధి సంఘాల డిమాండ్

సూర్యాపేట:జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరిండెంటెండ్ గా పనిచేస్తున్న రాఘవేంద్రనుసస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఈఓ ఆఫిస్ ఎదుట వివిధ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి,జిల్లా విద్యాశాఖ అధికారిఅశోక్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి మద్యపానం సేవించి రావడం,కార్యాలయంలో తోటి ఉద్యోగుల,విజిటర్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వింతచేష్టలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Superintendent Of Education Should Be Suspended - Demand Of Student Unions , Stu-TeluguStop.com

ఇలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు నవిలే ఉపేందర్,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ బిక్ష నాయక్,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్, సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు బానోత్ బాలు నాయక్,తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బారీ అశోక్,నాయకులు ఉప్పుల గణేష్ పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube