విద్యాశాఖ సూపరిండెంటెండ్ ను సస్పెండ్ చేయాలి-విద్యార్ధి సంఘాల డిమాండ్
TeluguStop.com
సూర్యాపేట:జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరిండెంటెండ్ గా పనిచేస్తున్న రాఘవేంద్రనుసస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఈఓ ఆఫిస్ ఎదుట వివిధ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి,జిల్లా విద్యాశాఖ అధికారిఅశోక్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి మద్యపానం సేవించి రావడం,కార్యాలయంలో తోటి ఉద్యోగుల,విజిటర్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వింతచేష్టలు
చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు నవిలే ఉపేందర్,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ బిక్ష నాయక్,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్, సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు బానోత్ బాలు నాయక్,తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బారీ అశోక్,నాయకులు ఉప్పుల గణేష్ పాల్గొన్నారు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా నిజంగానే ముహూర్తం జరుపుకుంటుందా..?