నందమూరి హీరో బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి( Bhagawant Kesari ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో శ్రీ లీల కీలక లేక పాత్రలో నటిస్తోంది.
ఇందులో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా ఈనెల 19వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా తరువాత దర్శకుడు బాబి( Director Bobby ) బాలకృష్ణ, కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని టాక్.
అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై తాజాగా ఒక రూమర్ వినిపిస్తోంది.ఇందులో బాలయ్య బాబు సరసన నటించిన హీరోయిన్ గా ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.
తాజాగా మరో హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.ఆమె మరెవరో కాదు హీరోయిన్ మీనాక్షి చౌదరి.( Meenakshi Chaudhary ) ఈమెని బాలయ్యకి జోడీగా సెలెక్ట్ చేశారని ఆమె పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది.

ఏది ఏమైనా బాలయ్య బాబు, మీనాక్షి చౌదరి కాంబినేషన్ అంటే అదిరిపోతుంది.ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయట.ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా ఇంకా మొదలు కాక ముందే భారీ అంచనాలు నెల కొన్నాయి.మరి ఈ మూవీ విడుదల అయ్యి ఎటువంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.







