కొత్త మండలాల్లో ప్రజలకు చేరువగా పాలన సౌకర్యాలు...!

సూర్యాపేట జిల్లా:గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పడిన నూతన మండలాల్లో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు లేక 10 ఏళ్ల పాటు అద్దె భవనాల్లో పాలన సాగింది.అద్దె కూడా సక్రమంగా చెల్లించక కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

 Governance Facilities To Be Brought Closer To People In New Mandals , Brs, Uttam-TeluguStop.com

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, నూతన మండలాల్లో ప్రభుత్వం కార్యాలయ భవన సముదాయాలకు శ్రీకారం చుట్టింది.రాష్ట్రనీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కొత్త మండలాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు కావలసిన స్థల పరిశీలనకుమండల అధికార యంత్రాంగం కదిలింది.

పాలకవీడు నూతన మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్,రెవెన్యూ,పోలీస్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థానిక ఎంపీపీ,ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు స్థల పరిశీలన చేశారు.ప్రభుత్వ భవనాల నిర్మాణ మంజూరి కొరకు అంచనా ప్రతులను మంత్రికి పంపుతున్నట్లు వారు వివరించారు.

దీనితో ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ కొనసాగిన ప్రభుత్వ కార్యాలయాలకు మోక్షం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube