నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం రామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని గుట్టల వద్ద కొందరు వ్యక్తులు భారీ మొత్తంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ ఫోర్స్ పోలీసుల శనివారం రాత్రి 11 గంటల సమయంలో మెరుపుదాడి చేసి,పేకాట ఆడుతున్న 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు మర్రిగూడ ఎస్ఐ కె.రంగారెడ్డి ఆదివారం రాత్రి మీడియాకు వెల్లడించారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం… మర్రిగూడ మండలం రామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి గుట్ట వద్ద రామిరెడ్డిపల్లికి చెందిన పగిల్ల రమేష్,గట్టుప్పల్ మండలం కమ్మగూడ గ్రామానికి చెందిన మేరుగు శ్రీనివాస్,నోముల రవిశేఖర్,చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన యల్లంకి జగన్,సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన కోల రాములు,మిర్యాలగూడకు చెందిన గాదె మధు,హుజూర్ నగర్ కు చెందిన శెట్టి శ్రీనివాస్, రామిరెడ్డిపల్లికి చెందిన పాముల శివశంకర్,కావలి నాగార్జున,వాకిటి హరీష్ కలసి పేకాట ఆడుతుండగా రైడ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.ఈ పేకాట శిబిరాన్ని నిర్వహించే కేసులో ఏ1 పగిల్ల రమేష్ అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక్కో ఆటకు రూ.5 వేలు కమిషన్ తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది.అరెస్ట్ చేసిన పేకాట రాయుళ్ళ వద్ద నుండి రూ.3, 51,150 నగదు,రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు,9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, మర్రిగూడ పోలీస్ స్టేషన్లో అప్పగించగా,విచారణ నిమిత్తం మర్రిగూడ పోలీసులు చింతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి రాత్రి 2 గంటల విచారణ అనంతరం ఆదివారం దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వీరిపై గేమింగ్ యాక్ట్ 3 మరియు 4 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.ఇదిలా ఉంటే ఈ పేకాట శిబిరం నిర్వహిస్తున్న వ్యక్తి ఇప్పటికే పలుమార్లు పేకాట కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది
.