నల్లగొండ జిల్లా: అదానీ మోదీ బంధం దేశానికే ప్రమాదకరంగా మారిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పోరేట్ సంస్థలకు వేల కోట్ల బకాయి రుణాలను మాఫీ చేస్తోందని ఆరోపించారు.
కేంద్ర,రాష్ర్టప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, మార్చి 15 నుంచి 30 వరకు అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక మీటింగ్స్ నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు.
ఈ సమావేశంలో సీపీఎం రాష్ర్టకమిటీ కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,జిల్లా నేతలు రవి నాయక్, మల్లు గౌతంరెడ్డి, తిరుపతి, రామ్మూర్తి,నాయకులు వాడపల్లి రమేష్,పిల్లుట్ల సైదులు,దైద భిక్షం, రామారావు,వెంకటరెడ్డి, సైదా నాయక్,బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.