ఉదయం పాలల్లో ఇవి కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

ఉదయం ఒక గ్లాసు పాలు( milk ) తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.పోషకాలకు పవర్ హౌస్ లాంటి పాలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.

 Amazing Health Benefits Drinking Date Milk! Date Milk, Date Milk Health Benefits-TeluguStop.com

అయితే పాలు నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయేవి కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) మరియు అరకప్పు కాచి చల్లార్చిన పాలు వేసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఇలా నానబెట్టుకున్న ఖర్జూరాల‌ను మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి.

పాలు హీట్ అయ్యాక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), రెండు దంచిన యాలకులు( Cardamom ) వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం మిశ్రమాన్ని వేసి మరొక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఈ పాలను గ్లాసులోకి సర్వ్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

Telugu Milk Benefits, Dates, Tips, Latest, Milk-Telugu Health

రోజు ఉదయం ఈ ఖర్జూరం పాలును తాగడం వల్ల రోజంతా మీరు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం, అలసట దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.

అలాగే ఈ ఖర్జూరం పాలు ప్రోటీన్, కాల్షియం కు గొప్ప మూలం.ఈ పాలు దృఢమైన కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి.

ఎముకలను బలోపేతం చేస్తాయి.ఖర్జూరం పాలలో ఐరన్ కంటెంట్ మెండుగా ఉంటుంది.

అందువల్ల ఈ మిల్క్ రోజు తాగితే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.

Telugu Milk Benefits, Dates, Tips, Latest, Milk-Telugu Health

అంతేకాదు ఈ ఖర్జూరం పాలు మెరుగైన రక్త ప్రసరణకు మద్దతు ఇస్తాయి.జీర్ణక్రియకు మరియు పేగు ఆరోగ్యాన్ని పెంచుతాయి.శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో మరియు పునరుద్ధరించడంలో సహాయపడ‌తాయి.

లైంగిక సమస్యలను దూరం చేస్తాయి.దృష్టి లోపాల‌కు చెక్ పెట్టి.

మొత్తం కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.మరియు ఖర్జూరం పాలు రోజూ తాగడం వల్ల చర్మం కూడా నిగారింపుగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube