ఈ మూడు రోజులు జాగ్రత్త ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి

నల్లగొండ జిల్లా: తెలంగాణాలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి.

 Be Careful These Three Days, Along With The Sun, The Rains Will Also Be Overwhel-TeluguStop.com

బయటకు రావాలంటే భయపడేలా మండుతున్నాయి.అంతలోనే మధ్యాహ్నం ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది.

ఉన్నట్లుండీ మేఘాలు కమ్ముకుని ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి.ఇవాళ్టి (ఏప్రిల్ 16) నుంచి రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ సూచించింది.

ఒకవైపు తీవ్రమైన ఎండలతో పాటు ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది.

మిగితా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.బంళాఖాతంలో ద్రోణి , ఉపరితల చక్రవాత ఆవర్తనంతో రాష్టానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

అధిక ఎండలతో గాలిలో తేమ శాతం పెరిగి,అక్కడక్కడ క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.ఇవాళ్టి నుంచి మూడు రోజులు (ఏప్రిల్ 16 నుంచి 18 వరకు) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.తెలంగాణలోని మూడు రోజుల పాటు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఇవాళ కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్,వరంగల్,హన్మకొండ, జనగాం,సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజిగిరి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఇవాళ (ఏప్రిల్ 16) ఎండలు అదిలాబాద్,కొమరం భీమ్ అసిఫాబాద్,నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, మంచిర్యాల,రాజన్న సిరిసిల్ల,కరీంనగర్ జిల్లాలలో అధికంగా ఎండలు ఉంటాయి.

రేపు (ఏప్రిల్ 17) వర్షాలు జయశంకర్ భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడం,ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట, మహబూబాబాద్,వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube