సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని 65వ నేషనల్ హైవే పక్కన గల రిలయన్స్ పెట్రోల్ బంకులో గురువారం అరుదైన గుడ్లగూబ దర్శనమిచ్చింది.దాన్ని గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
జిల్లా ఫారెస్ట్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు బీట్ ఆఫీసర్ మాచర్ల అచ్చయ్య పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని అరుదైన గుడ్లగూబను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు.
ఈ సందర్భంగా బీట్ ఆఫీసర్ అచ్చయ్య మాట్లాడుతూ ఈ వింత గుడ్లగూబ అరుదైన జాతికి చెందినదని,ముందు జాగ్రత్త కోసం వైద్య పరీక్షలు నిర్వహించామని,అడవిలో వదిలేస్తామని తెలియజేశారు.