సూర్యాపేట జిల్లా:బైక్ నడిపే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు పిలుపునిచ్చారు.పట్టణంలో సోమవారం ప్రజలను చైతన్యం చేసేందుకు వాహనదారులకు తెలిసే విధంగా హెల్మెట్ చైతన్య అవగాహన సదస్సులో భాగంగా బైక్ నడుపుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్,పట్టణ ఎస్సైలు శ్రీనివాస్, యాకూబ్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.