పర్యావరణ పరిరక్షణే ధ్యేయం.. ప్రపంచవ్యాప్తంగా 400 అడవులను నాటిన సిక్కు సంస్థ

మనిషి స్వార్థం, అభివృద్ధి పేరిట చెట్లు విపరీతంగా కొట్టివేయడం, కర్బన ఉద్గారాలు, కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.భూమి వేడెక్కడంతో పాటు గతి తప్పిన రుతుపవనాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మనిషి.

 Us-based Sikh Organisation Plants 400 Sacred Forests As Part Of Climate Action ,-TeluguStop.com

రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి.చెట్లు నాటాలని ఎంతోమంది పిలుపునిస్తున్నారు.

కానీ ఆచరించి చూపేవారి సంఖ్య అతి స్వల్పమే.ఈ నేపథ్యంలో ఓ సిక్కు సంస్థ మాత్రం.

వాతావరణ మార్పులపై సీరియస్‌గా దృష్టి సారించింది.భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటాలని సంకల్పించింది.

ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 చోట్ల అడవులను నాటింది.

అమెరికా కేంద్రంగా పనిచేస్తోన్న ‘ఎకోసిఖ్ ’.సిక్కు పర్యావరణ దినోత్సవం (ఎస్ఈడీ) సందర్భంగా .భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 400 ప్రాంతాల్లో అడవులను నాటనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ఐర్లాండ్‌లో 1150 చెట్లు, యూకేలోని డెర్బీషైర్‌లో 500 చెట్ల అడవిని నాటినట్లు నిర్వాహకులు తెలిపారు.దీనికి అదనంగా కెనడాలోని సర్రేలో 250 చెట్ల అడవిని నాటారు.

ఈ ప్రాజెక్ట్ కోసం స్థానిక ప్రభుత్వాలు, గురుద్వారాలతో కలిసి ఎకోసిఖ్ సంస్థ పనిచేసింది.ఈ అడవులను ‘Guru Nanak Sacred Forests‘గా పిలుస్తారు.

సిక్కు మత స్థాపకుడైన గురునానక్ 550వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 2019లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు ఎకోసిఖ్ తెలిపింది.ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పాలుపంచుకుంటున్నారు.

వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు ఇది మంచి కార్యక్రమం అని ఎకోసిఖ్ వ్యవస్థాపకుడు, గ్లోబల్ ప్రెసిడెంట్ రాజ్వంత్ సింగ్ అన్నారు.

Telugu Delhi, Ecosych, Gujarat, Haryana, Jammu, Maharashtra, Punjab, Rajasthan,

గత 36 నెలలుగా భారత్‌లోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూ సహా అనేక రాష్ట్రాల్లో ఎకోసిఖ్ అడవులను నాటినట్లు రాజ్వంత్ తెలిపారు.ఒక్కో అడవిలో 550 రకాల స్థానిక జాతుల చెట్లు వుంటాయన్నారు.జపనీస్ మియావాకీ పద్ధతిని అనుసరించి ఈ చెట్లను నాటామని.

పంజాబ్ సహా భారత్ అంతటా వీటిని గూగుల్ మ్యాప్ సాయంతో ట్యాగ్ చేశామని రాజ్వంత్ సింగ్ పేర్కొన్నారు.ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వున్న వందలాది సిక్కు సంస్థలు, గురుద్వారాలు కార్బన్ ఫుట్‌ప్రింట్స్‌ను తగ్గించేందుకు , నీటిని, ఇంధనాన్ని ఆదా చేసేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా సిక్కు పర్యావరణ దినోత్సవం (ఎస్ఈడీ) జరుపుకుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube