సూర్యాపేట జిల్లా: ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వెళుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సామాన్య కార్యకర్తలా మారిపోయారు.తన కాన్వాయ్ లో ఖమ్మం పయనమైన మంత్రి సూర్యాపేట రూరల్ మండలం సోలీపేట గ్రామం నుండి దిగి కార్యకర్తలతో కలిసి లారీలో ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరారు.
మంత్రి లారీ ఎక్కడంతో అందులోని కార్యకర్తలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.