బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు...!

సూర్యాపేట జిల్లా: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పర్యటనకు సిద్ధమైన నేరేడుచర్ల మండల బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ పోలీసులు అక్రమ అరెస్టులతో బీజేపీ ని అడ్డుకోలేరని అన్నారు.

 Early Arrests Of Bjp Leaders, Bjp Leaders, Bjp Leaders Arrest, Suryapet Distric-TeluguStop.com

వర్షాలతో నష్టపోయిన బాధిత కుటుంబాలను మరియు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తూ,అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక విపత్తుల సంఘం కమిటీ తెలంగాణ రాష్ట్రానికి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదన్నారు.

రాష్ట్ర పాలన ప్రగతి భవన్ కే పరిమితమైందని,ముందు చూపులేని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరద బాధితులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు కొనతం లచ్చిరెడ్డి,పట్టణ అధ్యక్షులు సంకలమద్ధి సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు పార్తనబోయిన విజయ్ కుమార్,జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తూరు వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు తాళ్లూరి రమేష్ నాయుడు,పట్టణ ఉపాధ్యక్షులు ఉరిమళ్ళ రామ్మూర్తి,జూలూరి అశోక్,పట్టణ కార్యదర్శి రాజేష్ రెడ్డి,మండల దళిత మోర్చా అధ్యక్షులు ఉప్పెల్లి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube