ప్రస్తుత పోటీ ప్రపంచంలో గెలవాలన్నా.తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలన్నా.
పరుగులు పెడుతూనే ఉండాలి.ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ అయిపోయింది.
మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పని చేసి చేసి సాయంత్రానికి పూర్తిగా అలిసిపోతారు.కొందరైతే బిజీ లైఫ్ వల్ల నిత్యం తీవ్రమైన ఒత్తిడి, తలనొప్పి తో బాధపడుతుంటారు.
ఇవి మన పర్సనల్ లైఫ్( Personal life ) ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి.అందుకే వీటిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి.
అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ అందుకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg powder ), అర అంగుళం దంచిన అల్లం వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు పోయాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ అశ్వగంధ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి స్లో ఫ్లేమ్ పై రెండంటే రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఆపై మిల్క్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనెను( honey ) కలిపి తీసుకోవాలి.రోజు సాయంత్రం వేళలో ఈ డ్రింక్ ను తీసుకుంటే ఒత్తిడి, తలనొప్పి క్షణాల్లో పరారవుతాయి.మళ్లీ మీరు ఫుల్ ఎనర్జిటిక్ గా మారతారు.చాలా మంది రాత్రుళ్లు నిద్ర పట్టక తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.అయితే నిద్రలేమి సమస్యను వదిలించడానికి కూడా ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే ప్రశాంతమైన సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.
మరియు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.మైగ్రేన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.
మరియు గుండెపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.







