గ‌ర్భ‌వతులు గుడ్డును ఇలా తీసుకుంటే చాలా డేంజ‌ర్‌..జాగ్ర‌త్త‌!

గ‌ర్భిణీ స్త్రీలు ఆహార విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అన్న సంగ‌తి తెలిసిందే.ఆహారంపైనే త‌ల్లితో పాటు క‌డుపులోని శిశువు ఆరోగ్యం కూడా ఆధార ప‌డి ఉంటుంది.

 Don`t Eat Egg Like This During Pregnancy! Pregnancy, Egg, Latest News, Raw Egg,-TeluguStop.com

అందుకే పెద్ద‌లు, ఆరోగ్య నిపుణులు గ‌ర్భ‌వ‌తుల‌ను పోష‌కాహా‌రాన్ని డైట్‌లో చేర్చుకోవాల‌ని సూచిస్తుంటారు.అయితే ఎన్ని పోష‌కాలు ఉన్న‌ప్ప‌టికీ కొన్ని కొన్ని ఆహారాల‌ను మాత్రం గ‌ర్భిణీలు ఎట్టి ప‌రిస్థితుల్లో తీసుకోరాదు.

మ‌రి ఆ కొన్ని కొన్ని ఆహారాలు ఏంటో.? వాటిని ఎందుకు తిన‌రాదో.? ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డు.

పోష‌కాల నిల‌యం.పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రికీ గుడ్డు ఎంతో మేలు చేస్తుంది.

కానీ, గ‌ర్భ‌వ‌తులు మాత్రం గుడ్డు తీసుకో రాదు.అదేంటి, గుడ్డు ఎందుకు తిన‌కూడ‌దు అని అనుకుంటున్నారా.? నిజానికి గ‌ర్భిణీ స్త్రీల‌కు కూడా గుడ్డు మంచిదే. కానీ, ప‌చ్చి గుడ్డును మాత్రం పొర‌పాటున కూడా తీసుకోరాదు.

ప‌చ్చి గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల‌.సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది.

దాంతో గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో క‌డుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌హిళ‌లు చేప‌ల‌ను తీసుకుంటే.

క‌డుపులోని శిశువు ఎదుగుద‌ల‌కు అవ‌స‌రం అయ్యే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విట‌మిన్ డి, ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి.కానీ, అపరిశుభ్రమైన నీటిలో పెంచిన చేపల‌ను, సముద్రపు చేపలను అస్స‌లు తీసుకోరాదు.

ఎందుకంటే, వీటిలో ప‌లు ర‌కాల కెమిక‌ల్స్‌ ఉంటాయి.ఈ కెమిక‌ల్స్‌ ఉడికించినప్పుడు కూడా పోవు.

అందుకే అటువంటి చేప‌ల‌ను తింటే గర్భస్రావం అయ్యే ప్ర‌మాదం పెరుగుతుంది.

Telugu Tips, Latest, Pregnancy, Pregnant, Raw Egg-Telugu Health - తెలు�

వీటితో పాటు బొప్పాయి, నిల్వ ప‌చ్చ‌ళ్లు, ఉడకని మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, నూనెలో వేయించిన ఆహారాలు, పంచ‌దార, పంచ‌దార‌తో త‌యారు చేసిన స్వీట్స్‌, ప‌చ్చి కూర‌గాయ‌లు, కాఫీ వంటి వాటిని కూడా గ‌ర్భిణీ స్త్రీలు తీసుకోరాద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube