సూర్యాపేట జిల్లా:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల శుభ సందర్భంగా దళిత,గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం సేవా భావంతో పనిచేస్తున్న సేవాతత్పరులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న దళితరత్న అవార్డు- 2022 కు సూర్యాపేట నియోజకవర్గం నుండి విశ్రాంత పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి కాశీమల్ల వెంకటనరసయ్య, న్యాయవాది ఏడేళ్ల అశోక్ ఎంపిక కావడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి కార్యాలయంలో దళితరత్న అవార్డు ఎంపికైన కాసిమళ్ల వెంకటనరసయ్య,న్యాయవాది అశోక్ లకు దళితరత్న అవార్డును అందజేసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల, గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలలో దళిత,గిరిజనులు భాగస్వాములు కావాలని,దళిత అవార్డుకు ఎంపికైన వారు సేవా భావంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది,మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్,న్యాయవాది రేగటి లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.