ధ్వంసం చేసిన నిరుపేదల ఇండ్లను పరిశీలించిన కౌన్సిలర్ల బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా కేంద్రంలోని హుస్నాబాద్ లోని సర్వేనెంబర్ 107 లోనిరుపేదల ఇండ్లను బస్వాపురం ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పేరుతో ప్రభుత్వ అధికారులు ధ్వంసం చేయడాన్ని భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ల బృందం తీవ్రంగా ఖండించింది.మంగళవారం ఆ ప్రాంతాన్ని బాధిత లబ్ధిదారులతో కలిసి సందర్శించిన ధ్వంసమైన ఇండ్లను పరిశీలించారు.

 A Group Of Councilors Inspected The Destroyed Poor Houses, Councilors, Houses ,-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరి పట్టణంలో ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్ల స్థలాలు కేటాయించిందని,అందులోపేద ప్రజలు ఇండ్లు నిర్మించుకుంటున్న తరుణంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

కొందరు పేదలు తమ యొక్కఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక బేస్మిట్ లెవెల్,గోడల లెవెల్,స్లాబ్ లెవెల్ లో ఉన్నారని,నిర్మాణంలో ఉన్న ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బస్వాపురం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు కొరకు 107 సర్వే నెంబర్ల స్థలాన్ని చదును చేస్తూ నిర్మాణంలో వాటిని అక్రమంగా ధ్వంసం చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్లు,ఇళ్ళ స్థలాల ఇవ్వకపోగా,నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాటిని లాక్కోవడం దారుణమన్నారు.ధ్వంసం చేసిన నిరుపేదల ఇళ్ళకు నష్టపరిహారం చెల్లించి,వారి స్థలాలు వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube