తెలంగాణ సాయుధపోరులో బీజేపీ,టీఆర్ఎస్ ఎక్కడ?

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, టిఆర్ఎస్ ల పాత్ర లేదని,అప్పటికి ఈ రెండు పార్టీలు పుట్టలేదని డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు శనివారం జరిగిన తెలంగాణ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.

 Where Are Bjp And Trs In Telangana Armed Conflict?-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నెహ్రూ నేత్ర్రత్వంలో ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్నాన్ని పంపి తెలంగాణను భారతదేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు.భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేని బిజెపి,టిఆర్ఎస్ లు పోటిపడి ఉత్సవాలు చేయడం విడ్డూరంగా వుందని అన్నారు.

అనంతరం శుక్రవారం మంత్రికి జై కొడుతూ జిల్లా ఎస్పీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఒక రాజకీయ పార్టీ నాయకుని మాదిరిగా ప్రవర్తిస్తూ మంత్రి జగదీష్ రెడ్డికి జై కొట్టడం ద్వారా తన పరిధి దాటి ప్రవర్తించారని డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.ఒక బాధ్యతగల పదవిలో ఉన్న ఎస్పీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.

జిల్లా ఎస్పీని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు,పట్టణ అధ్యక్షుడు అంజద్ ఆలీ,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు,జిల్లా,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube