సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని, సోషల్ మీడియా సైట్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పౌరులు బాధ్యతగా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి,పోలీసు శాఖ అధ్వర్యంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని, ఎవరైనా ఇతర వ్యక్తులను, రాజకీయ పార్టీలను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికలైన వాట్సప్,ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్,ట్విట్టర్ మొదలగు వాటిలో అనుచితమైన వాక్యాలు, పోస్టింగ్స్ పెడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి,ఎలక్ట్రానిక్ డివైజ్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.




Latest Suryapet News