రైతులను ఇబ్బంది పెట్టొద్దు:ఆర్డీఓ వేణుమాధవరావు

సూర్యాపేట జిల్లా:ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవరావు అన్నారు.శనివారం మండల పరిధిలోని దాచారం,ఆత్మకూర్ (ఎస్), నెమ్మికల్,ఏనుభాముల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

 Don't Trouble The Farmers Rdo Venumadhava Rao , Rdo Venumadhava Rao, Farmers-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, క్రయవిక్రయాల రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ప్రతిరోజు తేమ చూసి రికార్డుల్లో పొందుపరచాలన్నారు.

కొనుగోలు వేగవంతం చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు.ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర శర్మ,మండల తహసిల్దార్ వినోద్ కుమార్,మండల వ్యవసాయ అధికారులు దివ్య,విస్తరణాధికారులు శైలజ,శివకుమార్,సీనియర్ అసిస్టెంట్ ఇంద్ర కుమార్,సీఈఓ పట్నం లక్ష్మారెడ్డి,ఐకేపీ సీసీ చందు,గౌస్యా,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube