సూర్యాపేట జిల్లా: కోదాడలో సబ్ కోర్టు( Sub Court ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 62 జారీ చేయడం పట్ల కోదాడ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.శుక్రవారం న్యాయమూర్తులు శ్యాంసుందర్,భవ్యాలతో కలిసి బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా న్యాయవాదులు చేస్తున్న కృషికి ఫలితంగా,రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల కలను సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం( Telangana State Govt ) కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ, నడిగూడెం( Nadigudem ),మునగాల, అనంతగిరి,చిలుకూరు మండలాల పరిధిని సబ్ కోర్టుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి,హైకోర్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సబ్ కోర్టు ఏర్పాటుతో కక్షిదారులకు సత్వర న్యాయం జరగడంతో పాటు ఖర్చులు,సమయం ఆదా అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాస్ నాయుడు, సెక్రటరీ శరత్ బాబు, జాయింట్ సెక్రటరీ సీతారామరాజు,ట్రెజరర్ పాషా,న్యాయవాదులు రాధాకృష్ణమూర్తి,సుధాకర్ రెడ్డి,పాలేటి నాగేశ్వరరావు, పగడాల రామచంద్ర రెడ్డి, యశ్వంత్,రంగారావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.