సూర్యాపేట జిల్లా: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని హుజూర్‌నగర్, చింతలపాలెం పోలీస్ స్టేషన్ ఎస్సైలు కట్టా వెంకటరెడ్డి, కృష్ణారెడ్డిలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.వారి స్థానంలో 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలను నియమించారు.
హుజూర్‌నగర్ హరికృష్ణ, చింతలపాలెం హరిశ్వర్ రెడ్డిలను నియమించారు.పి.హరికృష్ణ గతంలో నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి, సూర్యపేట జిల్లాలోని నాగారం,మోతె, ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్ పని చేశారు.
ప్రస్తుతం సూర్యాపేట విఆర్ నుండి ఇక్కడికి బదిలీ అయ్యారు.
అలాగే హరిశ్వర్ రెడ్డి హైదరాబాదులోని నారాయణగూడెం, బంజారాహిల్స్, చాదర్‌గట్,నల్గొండ జిల్లాలోని నాంపల్లి,మాల్, మర్రిగూడ పోలీస్ స్టేషన్లో పనిచేసి నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు.హుజూర్‌నగర్ ఎస్సైగా పనిచేసిన కె.
వెంకటరెడ్డిని సూర్యాపేట వీఆర్ కు, చింతలపాలెం ఎస్సైగా పనిచేసిన కృష్ణారెడ్డిని నల్లగొండ వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.







