తెలంగాణలో కమలం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది.బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీని వీడేందుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది.
త్వరలోనే కమలంను వీడి హస్తం గూటికి చేరతారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.గతంలో ఈటల రాజేందర్ తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్ రెడ్డి గెలుపు సాధించారు.అయితే బీజేపీ తాజా సమీకరణాలలో ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంతో ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ విజయం సాధించే ఛాన్స్ తక్కువగా ఉండటంతో తన దారి తాను చూసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.