సూర్యాపేట జిల్లా: నేషనల్ హైవే 65 పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి వున్న లారీ కిందికి వేగంగా వస్తున్న కారు దూసుకుపోవడంతో కారులో ఉన్న భార్య భర్తలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మునగాల పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.