జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. అయితే ఈ న్యాచురల్ సీరం ను తప్పక ట్రై చేయండి!

సాధారణంగా కొందరి జుట్టు( Hair ) చాలా బలహీనంగా ఉంటుంది.కనీసం పట్టుకున్న కూడా వెంట్రుకలు చేతిలోకి వచ్చేస్తాయి.

 This Natural Serum Helps Hair Grow Thick And Strong!, Natural Serum, Hair Serum,-TeluguStop.com

కురులు బలహీనంగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్( Hairfall ) అనేది ఎక్కువగా ఉంటుంది.దీని కారణంగా రోజు రోజుకి జుట్టు పల్చగా మారుతుంటుంది.

ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా బలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

-Telugu Health

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న లవంగాలు, మెంతులు, కలోంజి సీడ్స్( Kalonji Seeds ) ‌వేసుకోవాలి.అలాగే మూడు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ) మరియు ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న పదార్థాలు స్టవ్ పై పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై అందులోని వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

-Telugu Health

ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం అనేది సిద్ధం అవుతుంది.ఈ సీరంను నేరుగా స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.మ‌సాజ్ అయ్యాక షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ సీరం( Natural Serum ) ను వాడితే బలహీనమైన కురులు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం తగ్గుతుంది.

అలాగే ఈ సీరం హెయిర్ గ్రోత్( Hair Growth ) ను ప్రమోట్ చేస్తుంది.జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.

మరియు చుండ్రు సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.కాబట్టి ఒత్తయిన మరియు బలమైన జుట్టును కోరుకునేవారు తప్పకుండా ఈ న్యాచురల్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube