1.ఎమ్మెల్యేలపై డిజిపి కి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల పైన విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేశారు.
2.జగన్ పై సిపిఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని , ఈ జగన్ మోహన్ రెడ్డికి ఏం పోయేకాలం వచ్చిందో అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
3.ఫోన్ ట్యాపింగ్ కేసు పై హైకోర్టు సంచలన ఆదేశాలు

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి మాజీ సీఈవో చిత్ర రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నమోదు అయిన కేసు కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు అయింది.
4.ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.కేంద్ర ఎన్నికల సంఘం నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
5.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను మళ్ళీ వైసిపి నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
6.ఇసుక రీచ్ లపై జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్
అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్ కు వ్యతిరేకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు.
7.ఢిల్లీ లిక్కర్ స్కాం లో మరో అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడు ఈడి అధికారులు ప్రముఖ మీడియా సంస్థ అధినేత రాజేష్ జోషిని అరెస్ట్ చేశారు.
8.బీ ఆర్ ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్
విద్యుత్ పై అసెంబ్లీలో మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు.24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు సభలో పచ్చి అబద్దాలు చెబుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని అప్పుడైనా ధర్నాలు కనపడతాయని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
9.లోకేష్ పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి 14వ రోజుకు చేరుకుంది.
10.ఆన్లైన్ రమ్మీ పై కేంద్రమంత్రి స్పందన
రాష్ట్రాలన్నీ కోరితే దేశంలో ఆన్లైన్ రమ్మీ పై నిషేధం అమలు కోసం పరిశీలిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
11.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నేడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఐదు కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
12.ద్వారకాతిరుమలలో జస్టిస్ కృపా సాగర్
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి ఆర్ కె కృపా సాగర్ దర్శించుకున్నారు.
13.బెజవాడలో పుస్తక మహోత్సవం

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ రోజు నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుంది.
14.వీఆర్వోలకు జీతాలు విడుదల చేయాలి
ఏపీ వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులకు ఇప్పటి వరకు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు ఏపీ సీఎం జగన్ కు విన్నవించారు.
15.అమరావతి నుంచి వందే భారత్ రైలు నడపాలి

ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ , చెన్నై, తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు.
16.కర్నూలులో జాతీయ న్యాయవర్సిటీ
కర్నూలులో 50 ఎకరాల్లో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
17.రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోండి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ నక్సలైట్లు గ్రైనేట్లు పెట్టి పేల్చివేసినా తమకు అభ్యంతరం లేదంటూ ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు.
18.కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోది కామెంట్స్
60 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందని బురద విసిరితే కమలం అంత వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోది రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో ధన్యవాదాలు తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
19.బైక్ మీద తిరుగుతా : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేనందును తాను బైక్ పైన తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 57,710
.






