నల్లగొండ జిల్లా: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది.ఆంధ్రాకు సరిహద్దు జిల్లా కావడంతో చికెన్ ప్రియులు చికెన్ తినాలంటే వణికిపోతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం దాదాపు 70 శాతం పైగా చికెన్ అమ్మకాలు పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ ధర కిలో రూ.200 లోపే ఉన్నా చికెన్ సెంటర్ కు వచ్చేవారు కరువయ్యారు.తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు నమోదు కాకున్నా, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చికెన్ తినొద్దని ప్రకటించకుండా బర్డ్‌ఫ్లూ భయం జిల్లా ప్రజలను వెంటాడుతుంది.
ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలో చనిపోయిన కోళ్లను చెరువులో వేసిన ఘటనపై పశుసంవర్థక శాఖ విచారణ చేపట్టింది.చికెన్ వ్యవహారాలు దివాలా తీయడంతో జిల్లాలో మటన్, చేపల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.